అమిత్ షాతో ఈటల రాజేందర్ భేటీ.. త్వరలో ఈటలకు కీలక బాధ్యతలు..!?

Etela Meet to Amith shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఈటల రాజేందర్ భేటీ ముగిసింది.

Arun Chilukuri
Updated on: 19 Jun 2022 8:45 PM IST
Etela Rajender Meets Amit shah
X

అమిత్ షాతో ఈటల రాజేందర్ భేటీ.. త్వరలో ఈటలకు కీలక బాధ్యతలు..!?

Etela Meet Amith shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఈటల రాజేందర్ భేటీ ముగిసింది. సమావేశంలో భాగంగా రాష్ట్రంలోని తాజా పరిస్థితులను అమిత్ షాకు వివరించారు ఈటల రాజేందర్. ఇందులో భాగంగా రానున్న ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని ఈటలతో షా చెప్పారు. అంతేకాదు తెలంగాణకు ఎక్కువ సమయం కేటాయిస్తానని త్వరలో తెలంగాణకు మరోసారి వస్తానని ఈటలతో అమిత్ షా చెప్పారు.

కొద్దిరోజులుగా అసంతృప్తితో ఉన్న ఈటల రాజేందర్‌కు అమిత్‌ షా కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఢిల్లీ వెళ్లిన ఆయన అమిత్ షాతో సమావేశం అయ్యారు. అసంతృప్తితో ఉన్న ఈటలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు టాక్ వినబడుతుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story