బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్.. ఇవాళ సాయంత్రం ప్రకటించే ఛాన్స్..?

Etela Rajender Telangana BJP Chief
x

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్.. ఇవాళ సాయంత్రం ప్రకటించే ఛాన్స్..?

Highlights

బీజేపీ హైకమాండ్​ తమ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై చర్చలు ప్రారంభించినట్టు తెలుస్తోంది.

Etela Rajender: ఎన్నికలు ముగిశాయి.. అనుకున్నంత రేంజ్‌లో కాకపోయినా గతంలో కంటే తెలంగాణలో అధికంగా సీట్లు సంపాదించింది బీజేపీ. అయితే ఇప్పుడు ఆ పార్టీకి మరో సవాల్ ముందుంది. ఇప్పటికే కేంద్ర మంత్రులు కూడా ఫిక్స్ అయిపోవడంతో ఫోకస్ అంతా అధ్యక్షుడి మార్పుపై మళ్లింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు అధ్యక్షుడి మార్పు జరగగా వ్యతిరేకించిన కేడర్‌కు ఎన్నికల అనంతరం మార్పు ఖాయమని అప్పుడే హైకమాండ్ స్పష్టం చేసింది.

మరోవైపు రెండోసారి కిషన్ రెడ్డికి కేంద్రంలో మంత్రి పదవి దక్కడంతో టీబీజేపీకి అధ్యక్ష మార్పు అనివార్యమైంది. ఇప్పటికే బీజేపీ హైకమాండ్​ తమ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై చర్చలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ నియామకం కానున్నట్టు ఆ పార్టీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం. సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్‌ షాతో ఈటల సమావేశం కానున్నారు. అనంతరం ఈటలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలిసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories