Etela Rajender: బీజేపీలో చేరిన ఈటల రాజేందర్

Etela Rajender: ఈటల రాజేందర్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

Arun Chilukuri
Updated on: 14 Jun 2021 12:46 PM IST
Etela Rajender Joins BJP
X

Etela Rajender: బీజేపీలో చేరిన ఈటల రాజేందర్

Etela Rajender: ఈటల రాజేందర్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, తరుణ్ చుగ్ సమక్షంలో ఈటల కాషాయ కండువా కప్పుకున్నారు. ఈటలతో పాటు మాజీ ఎంపీ రమేశ్‌ రాఠోడ్‌, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్‌ తుల ఉమ, ఆర్టీసీ కార్మిక సంఘ నేత అశ్వత్థామరెడ్డి, పలువురు ఉస్మానియా ఐకాస నేతలు భాజపాలో చేరారు. ఈటలకు పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని ధర్మేంద్ర ప్రధాన్‌ అందించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story