Etela Rajender: అపోలో ఆస్పత్రిలో చేరిన ఈటల రాజేందర్

Etela Rajender: ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు * ఈటలను పరామర్శించిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్

Sandeep Eggoju
Updated on: 31 July 2021 1:01 PM IST
Etela Rajender Joined Apollo Hospital in Hyderabad Jubilee Hills
X
అపోలో హాస్పిటల్ లో చేరిన ఈటెల రాజేందర్ (ఫైల్ ఇమేజ్)

Etela Rajender: మాజీ మంత్రి ఈటల రాజేందర్ హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేరారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో పన్నెండు రోజులుగా పాదయాత్ర చేస్తున్న బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు తీవ్ర జ్వరం, కాళ్లకు పొక్కులు రావడంతో పాదయాత్రకు తాత్కలికంగా బ్రేక్ వేశారు. కరీంనగర్‌లో వైద్యం అందించారు. వైద్యుల సలహాతో ఆయనను హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈటలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్ పరామర్శించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story