Etela Rajender: ఈటల బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్?

Etela Rajender: ఢిల్లీకి పయనమైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ * రేపు హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారు?

Sandeep Eggoju
Updated on: 31 May 2021 11:40 AM IST
Etela Rajender is Going To be Join in BJP
X

ఈటెల రాజేందర్ (ఫైల్ ఇమేజ్)

Etela Rajender: మాజీ మంత్రి ఈటల ఢిల్లీకి పయనమయ్యారు. బీజేపీలో చేరనున్నారన్న వార్తల నేపధ్యంలో ఈటల ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపుతోంది. మాజీ ఎంపీ వివేక్‌తో కలసి ఈటల ఢిల్లీకి పయనమయ్యారు. మరోవైపు.. హైదరాబాద్‌లో పలు కార్యక్రమాలకు హాజరయిన కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అపాయింట్‌మెంట్ ఖరారు కావడంతోనే ఈటల ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక.. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సైతం రేపు ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ మొత్తం పరిణామాల నేపధ్యంలో రేపు ఈటల బీజేపీ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story