Etela Rajender: బీజేపీలో ఈటల చేరేందుకు ముహూర్తం ఖరారు

Etela Rajender: హరీష్ రావు నాకంటే ఎక్కువగా అవమానాలకు గురి అయ్యారు: ఈటల

Sandeep Eggoju
Published on: 4 Jun 2021 2:48 PM IST
Etela Rajender Going to be Joined in BJP Next Week
X

ఈటెల రాజేందర్ (ఫైల్ ఇమేజ్)

Etela Rajender: ఈటల బీజేపీలో చేరేందుకు దాదాపుగా ముహూర్తం ఖరారు అయింది. మీడియా సమావేశం అనంతరం నిర్వహించిన చిట్‌చాట్ ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు తన కంటే ఎక్కువగా అవమానాలకు గురి అయ్యారని వెల్లడించారు. వచ్చే వారం ఢిల్లీలో బీజేపీలో చేరుతానని ఈటల స్పష్టం చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు..? సీపీఐ పోటీలో ఉండాలా లేదా అన్నది ఎవరు డిసైడ్ చేస్తున్నారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు టీఆర్ఎస్ ప్రయత్నించిందన్నారు. ఇప్పటికే హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ 50కోట్లు ఖర్చు పెట్టిందని మండిపడ్డారు.తాను ఢిల్లీ పర్యటనలో అమిత్‌షాతో ఫోన్‌లో మాట్లాడరని వెల్లడించారు. బీజేపీ అగ్రనేతల సమావేశంలో టీఆర్ఎస్ తో సంబంధాల గురించి అడిగానని అందుకు తగ్గట్టుగా వారు సమాధానాలు చెప్పారని పేర్కొన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story