logo
తెలంగాణ

Etela Rajender: చనిపోయిన టీచర్‌ కుటుంబానికి ఈటల భరోసా..

Etela Rajender Fires on CM KCR Over GO 317
X

Etela Rajender: చనిపోయిన టీచర్‌ కుటుంబానికి ఈటల భరోసా..

Highlights

Etela Rajender: కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Etela Rajender: కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఉద్యోగుల బదిలీలు అంటూ 317 జీవోను తీసుకొచ్చి ఉద్యోగులను ఆత్మహత్యలు చేసుకునేలా వ్యవహరిస్తున్నారని, జీవో 317ను రద్దు చేయాలని ఈటల డిమాండ్ చేశారు. ఉద్యోగ బదిలీలపై మనస్థాపానికి గురై ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వరంగల్ జిల్లా నర్సంపేట మండలం చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన టీచర్ ఉప్పుల రమేష్ కుటుంబ సభ్యులను ఈటల రాజేందర్ పరామర్శించారు. ఉప్పుల రమేష్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనన్నారు. ఉప్పుల రమేష్ కుటుంబానికి బీజేపీ పార్టీ అండగా ఉంటుందన్నారు.

Web TitleEtela Rajender Fires on CM KCR Over GO 317
Next Story