Etela Rajender: సాయంత్రం హైదరాబాద్‌ రానున్న ఈటల

Etela Rajender: బీజేపీలో చేరే తేదీపై నేడు నిర్ణయం తీసుకోనున్న ఈటల

Sandeep Eggoju
Updated on: 2 Jun 2021 3:35 PM IST
Etela Rajender Comming To Hyderabad Today Evening
X

ఈటెల రాజేందర్ (ఫైల్ ఇమేజ్)

Etela Rajender: ఢిల్లీలో వరుస భేటీలతో బిజిబిజీగా ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌కు రానున్నారు. బీజేపీలో చేరే తేదీపై ఇవాళ క్లారిటీ రానుంది. నిన్న రాత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో బండి సంజయ్, వివేక్ తో ఈటల కీలక సమావేశం నిర్వహించారు. ఈటల చేరిక, అనంతరం అనుసరించాల్సిన కార్యాచరణపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఓ వారంలో మళ్లీ ఈటల ఢిల్లీకి వెళ్లనున్నారు. త్వరలో ఈటల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story