Etela Rajender: రైతు బంధు పథకంలో రైతుల ప్రయోజనాలకు గండి

Etela Rajender: ఎన్నికల వచ్చినపుడే కేసీఆర్‌కు సామాన్యులు గుర్తుకొస్తారు

Jyothi
Published on: 19 Sept 2022 8:36 AM IST
Etela Rajender Comments On CM KCR
X

Etela Rajender: రైతు బంధు పథకంలో రైతుల ప్రయోజనాలకు గండి

Etela Rajender: పేదలకు సహకరించాల్సిన ప్రభుత్వ పథకాలు.. ఉన్నోళ్లకు దోచిపెడుతున్నారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆగ్రహించారు. సంగారెడ్డిజిల్లా జిన్నారంలో నిర్వహించిన కార్యకర్తల సభలో ఆయన వివిధ పార్టీలకు చెందిన నాయకులను, కార్యకర్తలను పార్టీ కండువాకప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. కేసీఆర్ పాలనలో రైతు బంధు పథకంతో రైతు ప్రయోజనాలకు బొందపెట్టారని ఆవేదన వ్యక్తంచేశారు. భూస్వాములకు రైతు బంధు బంగారు బాతుగా మారిందన్నారు. ఎన్నికలు వచ్చినపుడే కేసీఆర్‌కు సామాన్య ప్రజలు గుర్తొస్తారని మండిపడ్డారు. దళిత బంధు, గిరిజనబంధు వంటి పథకాలతో ఎరవేసి ఓట్లు రాబట్టుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికలు ఎపుడొచ్చినా తగిన బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన ప్రజలను కోరారు.

Jyothi

Jyothi

Next Story