ఈ సమయంలో మీరు సమ్మెకు దిగితే ప్రజలు ఇబ్బంది పడతారు- ఈటల

Etela Rajender: జూనియర్ డాక్టర్లు సమ్మెపై పునరాలోచించుకోవాలన్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్.

Arun Chilukuri
Published on: 26 May 2021 4:10 PM IST
Etela Rajender Asks Doctors to Rethink on Strike at This Time
X

ఈటల రాజేందర్(ఫైల్ ఇమేజ్ )

Etela Rajender: జూనియర్ డాక్టర్లు సమ్మెపై పునరాలోచించుకోవాలన్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. కరోనా కష్ట కాలంలో ప్రాణాలకు తెగించి వైద్యం అందిస్తున్న డాక్టర్ల సేవలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. ఇలాంటి సమయంలో డాక్టర్లు సమ్మెకు దిగితే ప్రజలు ఇబ్బంది పడతారన్న ఈటల సమ్మె నిర్ణయంపై మరోసారి ఆలోచించుకోవాలని కోరారు.

మరోవైపు జూనియర్ డాక్టర్ల డిమాండ్లు పరిష్కరించి వారిని సమ్మె విరమింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈటల. పెంచిన స్టై ఫండ్ వెంటనే అందించాలన్నారు. తాను ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నంతవరకు వైద్య సిబ్బందికి సమస్యలొస్తే వెంటనే స్పందించానన్న ఈటల ప్రస్తుత యంత్రాంగం కూడా జూడాల సమ్మెపై వెంటనే స్పందించాలన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story