వరంగల్‌లో టీఆర్ఎస్‌కు షాక్.. బీజేపీలోకి మంత్రి ఎర్రబెల్లి సోదరుడు..?

Errabelli Pradeep Rao May Resign For TRS Party
x

వరంగల్‌లో టీఆర్ఎస్‌కు షాక్.. బీజేపీలోకి మంత్రి ఎర్రబెల్లి సోదరుడు..?

Highlights

Warangal: వరంగల్ తూర్పులో టీఆర్ఎస్‌కు షాక్ తగిలింది.

Warangal: వరంగల్ తూర్పులో టీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. మంత్రి ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్‌రావు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. రేపు ముఖ్య అనుచరులతో ప్రదీప్‌రావు సమావేశంకానున్నారు. ఈనెల 7న ఢిల్లీలో అమిత్ షాను కలవనున్నారు. అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరే అవకాశం ఉంది. కొన్ని రోజులుగా టీఆర్ఎస్‌లో ప్రదీప్‌రావు అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనలో ప్రదీప్‌రావు వ్యవహారం సీఎం దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో రెండు రోజుల్లో హైదరాబాద్ రావాలని కేసీఆర్ ప్రదీప్‌రావును ఆదేశించారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో పార్టీ మార్పునకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories