Errabelli Dayakar Rao: వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మత్తులు

Errabelli Dayakar Rao: పంచాయతీరాజ్ శాఖలోని పలు అంశాలపై ఎర్రబెల్లి సమావేశం

Sandeep Eggoju
Published on: 8 Sept 2021 1:52 PM IST
Errabelli Dayakar Rao Decided to Repair the Damaged Roads in Telangana
X

ఎర్రబెల్లి దయాకర్ రావు (ఫైల్ ఇమేజ్)

Errabelli Dayakar Rao: ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌కు దెబ్బతిన్న పంచాయ‌తీరాజ్ శాఖ రోడ్లకు వెంట‌నే మ‌ర‌మ్మతులు చేప‌ట్టాల‌ని మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు అధికారుల‌ను ఆదేశించారు. పంచాయ‌తీరాజ్ శాఖ‌లోని ప‌లు అంశాలపై త‌న క్యాంపు కార్యాల‌యంలో ఉన్నతాధికారుల‌తో స‌మావేశమయ్యారు. కొత్త రోడ్ల కోసం ప్రతిపాద‌న‌ల‌ను మూడు రోజుల్లోగా పూర్తి చేయాల‌ని ఆదేశించారు. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ప్రజాప్రతినిధులతో మాట్లాడి ప్రతిపాద‌న‌లు సిద్ధం చేయాల‌ని మంత్రి సూచించారు. అదేవిధంగా ఇప్పటికే మంజూరైన ప‌నుల పురోగ‌తిని మంత్రి స‌మీక్షించారు. పంచాయ‌తీరాజ్ శాఖ‌లో ఇప్పటికే ప‌దోన్నతులు పొందిన‌ 57 మంది డీపీఓలు, ఎంపీడీఓలకు పోస్టింగులు ఇవ్వాల‌ని ఆదేశించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story