దమ్ముంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పాదయాత్ర చేద్దామా.. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు ఎర్రబెల్లి సవాల్‌..

Errabelli Dayakar Rao Challenged Will Do Padayatra In Bjp Ruled States
x

దమ్ముంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పాదయాత్ర చేద్దామా.. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు ఎర్రబెల్లి సవాల్‌..

Highlights

Errabelli Dayakar Rao: బండి సంజయ్‌ ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ అట్టర్‌ప్లాఫ్‌ అని విమర్శించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.

Errabelli Dayakar Rao: బండి సంజయ్‌ ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ అట్టర్‌ప్లాఫ్‌ అని విమర్శించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. బీజేపీ నేతల ప్రసంగాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప.. ఏమీ లేదని ఆరోపించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, టీబీజేపీ ఛీప్‌ బండి సంజయ్‌కు సవాల్‌ విసిరారు మంత్రి ఎర్రబెల్లి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కలిసి పాదయాత్ర చేద్దామని, తెలంగాణలో అమలవుతున్న అద్భుత పథకాలు అక్కడ ఉంటే.. తలవంచి క్షమాపణ చెబుతానని అన్నారు ఎర్రబెల్లి.

అధికారంలోకి వస్తే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ అంటున్న బీజేపీ నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటినుంచో రిజర్వేషన్ పెంచాలని కోరుతుందన్న విషయం గమనించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. బీజేపీకి ఇప్పుడు గిరిజనులు గుర్తుకొచ్చారా? అని ప్రశ్నించారు. 3 లక్షల కోట్లకు పైగా కేంద్రానికి పన్నుల రూపంలో చెల్లించామని ఎర్రబెల్లి వివరించారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది కేవలం 2 లక్షల కోట్లు మాత్రమేనని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు వాటా ఇచ్చినట్లు తెలంగాణకు కూడా ఇవ్వాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories