Erra Shekhar: బీఆర్ఎస్‌లో చేరిన జడ్చర్ల కాంగ్రెస్ అసంతృప్త నేత ఎర్ర శేఖర్

Erra Shekhar: కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన ఎర్ర శేఖర్‌

Shekhar G
Updated on: 29 Oct 2023 12:59 PM IST
Erra Shekhar Joined The BRS With The Presence Of KTR
X

Shekhar: బీఆర్ఎస్‌లో చేరిన జడ్చర్ల కాంగ్రెస్ అసంతృప్త నేత ఎర్ర శేఖర్

Erra Shekhar: జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌ బీఆర్ఎస్‌లో చేరారు. మంత్రి కేటీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఉద్యమ కాలం నుంచి సీఎం కేసీఆర్‌తో తనకు గొప్ప అనుబంధం ఉందన్నారు ఎర్ర శేఖర్. బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌లో తమకే టికెట్‌ వస్తుందని ఆశపడినవారు... ఇప్పటివరకు ప్రకటించిన రెండు జాబితాల్లో తమ పేరు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కోసం పనిచేసినవారికి కాకుండా కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story