ఎంసెట్‌ సహా అన్నీ పరీక్షల దరఖాస్తు గడువు పెంపు

Arun Chilukuri
Published on: 26 May 2020 4:32 PM IST
ఎంసెట్‌ సహా అన్నీ పరీక్షల దరఖాస్తు గడువు పెంపు
X

తెలంగాణలో ప్రవేశ పరీక్షల దరఖాస్తు స్వీకరణ గడువును పొడిగించారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటన విడుదల చేసింది. ఎంసెట్‌, ఈసెట్‌, లాసెట్‌, ఐసెట్‌, పీజీఈసెట్‌, పీజీ ఎల్‌సెట్‌, ఎడ్‌ సెట్‌, పీఈ సెట్‌ అన్నీ ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును జూన్‌ 10 వరకు పొడిగించారు. జూన్‌ 10 వరకు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని ఉన్నత విద్యా మండలి సూచించింది. ఎంసెట్‌, ఐసెట్‌, ఈసెట్‌, ఎడ్‌ సెట్‌, పీజీఈసెట్‌, పీఈసెట్‌, లాసెట్‌, పీజీఎల్‌ సెట్‌ తదితర ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును పెంచుతూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story