Etela Rajender: మంత్రి ఈటల భూ వ్యవహారంలో కొనసాగుతున్న విచారణ

Etela Rajender: మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామంలో మంత్రి ఈటల రాజేందర్ భూ వ్యవహారంలో విచారణ కొనసాగుతోంది.

Arun Chilukuri
Published on: 1 May 2021 5:02 PM IST
Enquiry on Going Allegations Made Against Etela Rajender
X

Etela Rajender: మంత్రి ఈటల భూ వ్యవహారంలో కొనసాగుతున్న విచారణ

Etela Rajender: మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామంలో మంత్రి ఈటల రాజేందర్ భూ వ్యవహారంలో విచారణ కొనసాగుతోంది. స్థానిక ప్రాథమిక పాఠశాలలో మండల తహసీల్దార్ మాలతి సిబ్బంది, విజిలెన్స్ ఎస్పీ మనోహర్, విజిలెన్స్ డిఎస్పీ ఆనంద్‌ల సమక్షంలో రైతులను విచారిస్తున్నారు. రైతుల భూములను తీసుకునే ముందు ఎవరు వచ్చారు..? ఏ రకంగా భూములను తీసుకున్నారనే కోణంలో విచారిస్తున్నారు. మరోవైపు ఉదయం నుంచి ఈటల పాల్ట్రీ, అచ్చంపేటకు భారీగా పోలీసులు మోహరించారు. తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్, రామయంపేట్ సీఐ నాగార్జున గౌడ్ ఆద్వర్యంలో భద్రత ఏర్పాటు చేశారు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story