Congress Meeting: గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతల అత్యవసర సమావేశం

* ధాన్యం కొనుగోళ్లు, రైతుల కష్టాలు తదితర అంశాలపై చర్చ * పెట్రోల్, డీజిల్ ధరలపై పన్నులు తగ్గించకపోవడం పైనా చర్చ

Shilpa
Published on: 6 Nov 2021 6:18 PM IST
Emergency Meeting of Congress Leaders at Gandhi Bhavan
X

గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతల అత్యవసర సమావేశం(ఫోటో- ది హన్స్ ఇండియా)

Congress Meeting: తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహంతో ఉంది. పీసీసీ చీఫ‌ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సీనియర్ల భేటీలో రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, రైతుల కష్టాలు, పెట్రోల్, డీజిల్ ధరలపై పన్నులు తగ్గించకపోవడం తదితర అంశాలపై చర్చ జరిగింది.

రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ రేవంత్, షబ్బీర్ ఆలీ, గీతారెడ్డి, పొన్నాల, దామోదర రాజనర్సింహా, మల్లు రవి, చిన్నారెడ్డి, దాసోజు శ్రవణ్, కోదండరెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వైఖరి మారకపోతే త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించాలనే ఆలోచనలో పార్టీనేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

Shilpa

Shilpa

Next Story