గచ్చిబౌలి కారు ప్రమాదంలో మృతి చెందిన మహేశ్వరిని ఆదుకునేందుకు ఎల్లా హోటల్‌ ముందుకు...

Gachibowli Car Accident: గత 15 ఏళ్లుగా ఎల్లా హోటల్‌లో పనిచేస్తున్న మహేశ్వరి...

Shireesha
Updated on: 20 March 2022 10:30 AM IST
Ellaa Hotel Came Forward to Support Maheswari Who Dead in Car Accident in Gachibowli | Live News
X

గచ్చిబౌలి కారు ప్రమాదంలో మహేశ్వరి మృతి.. ఆదుకునేందుకు ఎల్లా హోటల్‌ ముందుకు...

Gachibowli Car Accident: గచ్చిబౌలి కారు ప్రమాదంలో మృతి చెందిన మహేశ్వరి కుటుంబాన్ని ఆదుకునేందుకు ఎల్లా హోటల్‌ ముందుకొచ్చింది. అధికారుల జోక్యంతో స్పందించిన హోటల్‌ యాజమాన్యం.. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చింది. నిన్న హోటల్‌ దగ్గర మొక్కలకు నీరు పోస్తుండగా కారు ఢీకొట్టడంతో మహేశ్వరి అక్కడికక్కడే మృతి చెందింది.

గత 15ఏళ్లుగా ఎల్లా హోటల్‌లో పనిచేస్తున్న మహేశ్వరి.. డ్యూటీ చేస్తుండగా కారు ప్రమాదంలో మృతి చెందింది. అయితే.. 20ఏళ్ల క్రితం ఎల్లా హోటల్‌ నిర్మాణంలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు మహేశ్వరి భర్త కూడా మరణించినట్టు తెలుస్తోంది.

Shireesha

Shireesha

Next Story