Dubbaka: పేలిన ఎలక్ట్రిక్ స్కూటీ.. స్కూటీ తోపాటు ఇల్లు దగ్ధం

Dubbaka: సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద చీకోడులో పేలిన ఎలక్ట్రిక్ స్కూటీ

Rama Rao
Published on: 8 Jun 2022 10:34 AM IST
Electric Bike Catches Fire in Dubbaka Siddipet District
X

Dubbaka: పేలిన ఎలక్ట్రిక్ స్కూటీ.. స్కూటీ తోపాటు ఇల్లు దగ్ధం

Dubbaka: సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దచీకోడులో ఎలక్ట్రిక్ స్కూటీ దగ్ధమయ్యింది. ఇంటి ముందు ఉంచిన ఛార్జింగ్ స్కూటీ పేలడంతో ఇల్లు దగ్ధమయ్యింది. అయితే బైక్ పేలిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కానీ ఇంట్లో ఉన్న వస్తువులు మాత్రం పూర్తిగా కాలిపోయాయి.

ఇంటి ఆవరణలో రాత్రి బైక్ ను పార్క్ చేశారు. రాత్రి 12 గంటల సమయంలో పెద్ద శబ్ధంతో బైక్ పేలింది. భారీగా మంటలు అంటుకోవడంతో.. ఫైరింజన్‌కు సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

Rama Rao

Rama Rao

Next Story