Telangana: రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీ లకు షెడ్యూల్ విడుదల

Telangana: రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.

Kranthi
Published on: 15 April 2021 2:19 PM IST
Elections Notification Released for Two Corporations and Five Municipalities in Telangana
X

Telangana:(File Image)

Telangana: నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు పోరు ముగియకుండానే తెలంగాణలో మరో ఎన్నికల పోరుకు ఈసీ సిద్ధమైంది. తెలంగాణలో రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం, నగరపాలికలతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్‌ పురపాలికల ఎన్నికలకు సర్వం సిద్దమైంది. రేపటి నుంచి ఈనెల 18 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 19న అభ్యర్థుల నామపత్రాల పరిశీలన, 22 వరకు నామినేషనల్ ఉప సంహరణకు అవకాశం కల్పించారు.

ఈ నెల 17న తిరుపతి పార్లమెంట్, నాగార్జున సాగర్‌ అసెంబ్లీ స్థానానికి పోలింగ్‌ జరుగుతుంది. చివరి అస్త్రంగా ఆయా పార్టీలు రెండు చోట్లా సర్వశక్తులూ ఒడ్డుతూ ప్రచారం ఉదయం నుంచే నిర్వహించడం షురూ చేశాయి. ఇప్పటికే అల్టిమేట్ క్యాంపెయిన్ అన్నట్టు తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాగర్ లో సమరశంఖం పూరించేశారు. అటు, తిరుపతిలో మాత్రం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా నేపథ్యాన్ని చూపుతూ ప్రచారం, బహిరంగ సభను రద్దు చేసుకున్నప్పటికీ వైసీపీ మంత్రులు, నేతలు ఊపిరిసలపని ప్రచారం నిర్వహిస్తూ తమ పార్టీ అభ్యర్థి గెలుపుకోసం కృషి చేస్తున్నారు.

Kranthi

Kranthi

Next Story