Bandi Sanjay: బండి సంజయ్‌ పాదయాత్రకు ఎన్నికల కోడ్ కష్టాలు

Bandi Sanjay: కన్ఫ్యూజన్‌లో బీజేపీ రాష్ట్ర నాయకత్వం

Sandeep Eggoju
Updated on: 29 Sept 2021 2:08 PM IST
Elections Code Problems to Bandi Sanjay Padayatra
X

బండి సంజయ్ పాదయాత్ర (ఫైల్ ఇమేజ్)

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ పాదయాత్రకు ఎన్నికల కోడ్‌ కష్టాలు మొదలయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధఠంగా కఠిన నిబంధనలు విధించింది కేంద్ర ఎన్నికల సంఘం. నియోజకవర్గంలో ఎలాంటి బ‎హిరంగ సభలు నిర్వహించొద్దంటూ ఆదేశాలిచ్చింది. అయితే మొదటి విడత పాదయాత్ర ముగింపు సభ.. భారీ జనసమీకరణతో పెట్టాలనీ బీజేపీ ప్లాన్‌ చేసింది. అక్టోబర్‌ 2న హుజూరాబాద్‌లో ఈ సభ జరపాలని కమలం పార్టీ భావించింది. అయితే ఎన్నికల కోడ్‌ అమలు నేపథ్యంలో.. బీజేపీ రాష్ట్ర నాయకత్వం కన్ఫ్యూజన్‌లో పడింది. కరీంనగర్‌ జిల్లాకు సమీపంలోని ప్రాంతంలో సభ పెట్టాలని భావిస్తోంది బీజేపీ.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story