మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి ఊరట

Election Commission of India: మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి ఊరట లభించింది.

Arun Chilukuri
Published on: 1 Nov 2022 5:03 PM IST
Election Commission Give Clearance to Komatireddy Rajgopal Reddy
X

మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి ఊరట 

Election Commission of India: మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి ఊరట లభించింది. ఉపఎన్నిక నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డికి చెందిన సుశీ కంపెనీ నుంచి పలువురికి నగదు బదిలీ అయ్యిందని మొత్తం 5 కోట్లా 24 లక్షల మేర నగదు వివిధ అకౌంట్లకు బదిలీ అయినట్లు ఎన్నికల కమిషన్‌కు టీఆర్ఎస్ కంప్లైంట్ చేసింది. అలా ఖాతాల్లో పడ్డవారంతా మునుగోడుకు సంబంధించిన వారే అని తన కంప్లైంట్‌లో టీఆర్ఎస్‌ పేర్కొంది. దీనిపై విచారణ జరిపిన ఈసీ టీఆర్ఎస్ చేసిన కంప్లైంట్‌లో ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఆరోపణలన్నీ నిరాధారమైనవని తేల్చిచెప్పింది. అంతేకాదు.. ఎన్నికల ఖర్చుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story