Kasireddy Narayan Reddy: ప్రతి తండాకు బీటీ రోడ్లు వేయడమే నా కర్తవ్యం

Kasireddy Narayan Reddy: ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యనందించడమే నా ధ్యేయం

Shekhar G
Published on: 21 Nov 2023 7:31 PM IST
Election Campaign Of Congress Candidate Kasireddy Narayan Reddy in Kalwakurthy
X

Kasireddy Narayan Reddy: ప్రతి తండాకు బీటీ రోడ్లు వేయడమే నా కర్తవ్యం

Kasireddy Narayan Reddy: కల్వకుర్తి నియోజకవర్గ రైతులకు ప్రతి ఎకరాకు నీళ్లు పారించడమే తన లక్ష్యమని, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడమే తన ధ్యేయమని కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. ప్రతి తండాకు బీటీ రోడ్లు వేయడమే నా కర్తవ్యమన్నారాయన... రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలోని మెదక్‌పల్లి చౌదర్‌పల్లి, మాదాయపల్లి, ఇశ్రాయిపల్లి, వెల్జాల్ గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి, కాంగ్రెస్ నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, చీమర్ల అర్జున్ రెడ్డి తలకొండపల్లి మండల పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ‍యన మాట్లాడారు. కల్వకుర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story