Medak Dead Body Dig out for Gold: ముక్కుపుడక కోసం కాటికాపరి ఏం చేసాడో తెలుసా..

Sumitra
Published on: 3 July 2020 4:32 PM IST
Medak Dead Body Dig out for Gold: ముక్కుపుడక కోసం కాటికాపరి ఏం చేసాడో తెలుసా..
X
ప్రతీకాత్మక చిత్రం

Medak Dead Body Dig out for Gold: డబ్బు కోసం, బంగారం కోసం కొంత మంది ఎంతటి నేరాలు చేయడానికైనా వెనకాడరు. దొంగతనాలు, దోపిడీలు, మర్డర్ లు కూడా చేస్తారు. కానీ మెదక్ లో మాత్రం ఓ వ్యక్తి బంగారు ముక్కుపుడక కోసం ఈ అన్ని దారుణాల కంటే కూడా ఒళ్లు గగుర్పొడిచే విధంగా పెద్ద దారుణానికి ఒడిగట్టాడు. అసలు ఆ వ్యక్తి ఏం చేసాడు అనుకుంటున్నారా. అయితే వివరాల్లోకెళదాం. మెదక్ పట్టణంలోని గోల్కొండ వీధికి చెందిన కొప్పుల పోచమ్మ అనే వృద్ధురాలు నివసించేది. కాగా ఆమె జూన్ 24వ తేదీన అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయింది. విషయం తెలుసుకున్న బంధువులంతా వచ్చి ఆమెను కడసారి చూపులు చూసి తమ సంప్రదాయం ప్రకారం స్థానిక శ్మశాన వాటికలో ఖననం చేశారు.

ఖననం చేసే సమయంలో పోచమ్మ మృతదేహానికి ముక్కు పుడకలు ఉండటాన్ని కాటికాపరి, అతని సంబంధీకులు గమనించారు. ఎలాగయినా ఆ ముక్కుపుడకలను దోచుకోవాలనుకున్నారు. సమయం కోసం ఎదురుచూసి గురువారం మృతదేహాన్ని వెలికి తీసి ఆ రెండు బంగారు ముక్కు పుడకలను తీసుకునే ప్రయత్నం చేశారు. సరిగ్గా అదే సమయానికి శ్మశాన వాటి దగ్గరి నుంచి వెలుతున్న కొంత మంది గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ తరువాత మృతురాలి కుమారుడు కూడా ఈ విషయాన్ని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. అసలు ఈజీగా వచ్చే సొమ్ముకోసం ఎంతటి నేరాలు చేయడానికైనా వెనకాడరని శవాన్ని బయటకు తీసిన ఘటన పట్ల స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.


Sumitra

Sumitra

Next Story