Nagar Kurnool‌: ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

Nagar Kurnool‌: నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Arun Chilukuri
Updated on: 23 July 2021 8:45 PM IST
Eight People Lost Life in Road Accident at Nagar Kurnool
X

Nagar Kurnool‌: ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

Nagar Kurnool‌: నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉప్పునుంతల మండలంలోని చెన్నారం గేట్ దగ్గర రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. రోడ్డు ప్రమాదం ధాటికి రెండు కార్లు నుజ్జునజ్జయ్యాయి. ఘటనా స్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు కార్లలో చిక్కున్న మృతదేహాలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒకరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story