దమ్ముంటే తన మీద పోటీ చేసి గెలవాలని కేసీఆర్, హరీష్‌రావుకు ఈటల సవాల్

* నన్ను ఓడించేందుకు రూ.5 వేల కోట్లైనా ఖర్చు చేస్తారట- ఈటల * నేను దిక్కులేనివాడిని కాదు. హుజూరాబాద్ ప్రజల హృదయాల్లో ఉన్నా

Sandeep Reddy
Updated on: 8 Aug 2021 7:00 PM IST
Eetala Rajender Challenge to CM KCR And Minister Harish Rao Compete in Bypoll Against Him And Win
X

ఈటల రాజేందర్ (ఫైల్ ఫోటో)

Etela Rajender: సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులకు బీజేపీ నేత ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. దమ్ముంటే హుజూరాబాద్‌లో పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. హుజూరాబాద్ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న బిడ్డనని అన్నారు. దళిత బంద్ ఇచ్చినా, గొర్రెలిచ్చినా, కులాలవారీగా తయిలాలిచ్చినా గెలవలేరని అన్నారు. ఎన్నికల్లో చూసుకుందాం రండి అని అన్నారు. దళితుల ఓట్ల మీద తప్ప హుజూరాబాద్ దళితులపై కేసీఆర్‌కు ప్రేమ లేదని ఈటల రాజేందర్ అన్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story