Edupayala: ఏడుపాయలలో వైభవంగా వనదుర్గామాత రథోత్సవం

Edupayala: అట్టహాసంగా రథోత్సవం నిర్వహించిన ఆలయ అధికారులు

Jyothi
Published on: 11 March 2024 10:47 AM IST
Edupayala Vanadurga Mata Rathotsavam
X

Edupayala: ఏడుపాయలలో వైభవంగా వనదుర్గామాత రథోత్సవం

Edupayala: మెదక్ జిల్లా ఏడుపాయల జాతరలో చివరి అంకం అట్టహాసంగా ముగిసింది. వనదుర్గామాత రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారం ఆలయ కమిటీ ఛైర్మన్, ఈవో నాగ్సాన్ పల్లి గ్రామానికి చెందిన పెద్దకాపును రథోత్సవానికి ఆహ్వానించారు. అనంతరం పండితులు విగ్రహాలను రథంలో ప్రతిష్టించగా.. ఆలయ ఛైర్మన్ బాలగౌడ్ ఉత్సవాన్ని ప్రారంభించారు. రంగోలి ప్రాంతం నుంచి రాజగోపురం వరకు రథోత్సవం జరగగా.. భక్తులు ఉత్సాహంగా పాల్గొని రథాన్ని లాగారు. దుర్గమ్మ నామస్మరణతో ఏడుపాయల గుట్టలు మార్మోగాయి. ఇక ఈ రథోత్సవంతో ఏడుపాయలలో నిర్వహించే మూడు రోజుల జాతర ముగిసింది.

Jyothi

Jyothi

Next Story