ED Raids: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నివాసంలో ఈడీ సోదాలు

ED Raids: హైదరాబాద్‌లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. పటాన్‌చెరు ఎమ్మెల్యే MLA గూడెం మహిపాల్ రెడ్డి నివాసంలో ఈడీ తనిఖీలు చేపట్టింది.

Arun Chilukuri
Published on: 20 Jun 2024 9:40 AM IST
ED Raids On BRS MLA Mahipal Reddy House
X

ED Raids: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నివాసంలో ఈడీ సోదాలు

ED Raids: హైదరాబాద్‌లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. పటాన్‌చెరు ఎమ్మెల్యే MLA గూడెం మహిపాల్ రెడ్డి నివాసంలో ఈడీ తనిఖీలు చేపట్టింది. మహిపాల్ రెడ్డి కుటుంసభ్యులు బంధుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి.. మొత్తంగా ఏకకాలంలో మూ చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే, ఆయన సోదరుడు గూడెం మధుసూదన్‌ రెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టారు.

ఈడీ సోదాల విషయం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఇద్దరు సోదరులు మైనింగ్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఇటీవలి కాలంలో ఓ కేసులో గూడెం మధు అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. ఇక, తాజా సోదాల గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story