క్యాసినో వ్యవహారంలో ముగిసిన ఈడీ సోదాలు

ED Raids: ప్రవీణ్‌ చికోటి, మాధవరెడ్డి ఇళ్లలో తెల్లవారుజామున వరకు సోదాలు

Jyothi
Published on: 28 July 2022 11:03 AM IST
ED Raids Complete in Chikoti Praveen and Madhava Reddy Houses Over Casino Issue
X

క్యాసినో వ్యవహారంలో ముగిసిన ఈడీ సోదాలు

ED Raids: క్యాసినో వ్యవహారంలో ఈడీ సోదాలు ముగిశాయి. మొత్తం 8 ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రవీణ్‌ చికోటి, మాధవరెడ్డి ఇళ్లలో తెల్లవారుజామున వరకు సోదాలు కొనసాగాయి. తెలంగాణలోని సైదాబాద్‌, బోయిన్‌పల్లి, కడ్తాల్‌లో ఈడీ సోదాలు జరిగాయి. సుమారు 20 గంటల పాటు తనిఖీలు చేసిన అధికారులు ప్రవీణ్‌ చికోటి నుంచి సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నారు. నేపాల్‌లో లీగల్‌గా క్యాసినో నిర్వహించినట్టు ఈడీ అధికారులకు ప్రవీణ్‌ తెలిపాడు. దీంతో ప్రవీణ్‌ ల్యాప్‌టాప్‌లో అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీశారు అధికారులు. అలాగే పంటర్స్‌తో జరిపిన లావాదేవీలపై ప్రవీణ్‌ నుంచి వివరాలు సేకరించారు. హవాలా రూపంలో చెల్లింపులపై ఈడీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story