MLC Kavitha: ఎమ్మెల్సీ కవితను ఐదో రోజు విచారించిన ఈడీ ఆధికారులు

MLC Kavitha: ఇవాళ సుప్రీంకోర్టులో బెంచ్ మీదకు కవిత రిట్ పిటిషన్

Jyothi
Published on: 22 March 2024 8:04 AM IST
ED officials interrogated MLC Kavitha on the fifth day
X

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితను ఐదో రోజు విచారించిన ఈడీ ఆధికారులు

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఐదో రోజు ఈడీ ఆధికారులు విచారించారు. ఇవాళ సుప్రీంకోర్టులో బెంచ్ మీదకు కవిత రిట్ పిటిషన్ విచారణకు రానున్నది. లిక్కర్ కేసులో కీలక విషయాలను రాబట్టడంలో భాగంగా ఆగస్ట్ 22న ఈడీ దర్యాప్తు మొదలు పెట్టింది. నాలుగో రోజు కవిత పీఏలు రాజేష్, రోహిత్ లను విచారించారు ఈడీ అధికారులు.

కవిత అరెస్ట్ సమయంలో పీఏల ఫోన్లను సీజ్ చేయించిన అధికారులు.. ఫోన్లు అన్ లాక్ చేయించి అందులోని డేటా ఆధారంగా ప్రశ్నించింది. మరో వైపు తన అరెస్టు అంశంలో ఈడీ అధికారులు నిబంధనలు ఉల్లంఘించారంటూ కవిత ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ట్రాన్సిట్ రిమాండ్ వారెంట్ లేకుండా ఈడీ అరెస్ట్ చేసిందని తన పిటిషన్ లో తెలిపారు.

Jyothi

Jyothi

Next Story