MLC Kavitha: కవితకు ఈడీ మళ్లీ నోటీసులు.. ఈనెల 20న విచారణకు రావాలన్న ఈడీ

MLC Kavitha: ఇవాళ విచారణకు గైర్హాజరు కావడంతో మరోసారి నోటీసులు

Jyothi
Published on: 16 March 2023 2:48 PM IST
ED Notices Again for the MLC Kavitha
X

MLC Kavitha: కవితకు ఈడీ మళ్లీ నోటీసులు.. ఈనెల 20న విచారణకు రావాలన్న ఈడీ

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు ఈడీ మళ్లీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 20న విచారణకు రావాలని కవితకు నోటీసులు జారీ చేశారు. ఢిల్లీలో లిక్కర్ స్కామ్‌ సెగలు రేపుతోంది. ఈడీ విచారణకు ఇవాళ కవిత గైర్హాజరయ్యారు. సుప్రీంకోర్టులో పిటిషన్‌ ఉన్నందున రాలేనని ఈడీకి కవిత లేఖ రాశారు. ఉదయం ఢిల్లీలోని కేసీఆర్ నివాసం వద్ద హైడ్రామా నడిచింది. ఉదయం నుంచి మంత్రులతో కవిత చర్చించారు. ముందుగా ప్రెస్‌మీట్ పెట్టి విచారణకు వెళ్తానన్న కవిత... న్యాయనిపుణులతో చర్చ తర్వాత ఈడీ ఆఫీస్‌కు లేఖ పంపారు. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున... విచారణకు రాలేనని చెప్పింది. ఈ మేరకు తన న్యాయవాది సోమాభరత్‌తో ఈడీ ఆఫీస్‌కు సమాచారం పంపింది.

Jyothi

Jyothi

Next Story