ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత లేఖపై స్పందించని ఈడీ

ED: మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం..?

Jyothi
Published on: 16 Jan 2024 11:26 AM IST
ED not Responding to Kavitha Letter in Delhi Liquor Scam Case
X

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత లేఖపై స్పందించని ఈడీ

ED: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత లేఖపై ఈడీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో సందిగ్ధత నెలకొంది. కవిత విచారణకు హాజరవుతారా లేదా అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం కవిత విదేశీ పర్యటనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ విచారణకు హాజరుకావాలని కవితకు ఈడీ నోటీసులు అందించింది. అయితే ముందుస్తు షెడ్యూల్ ఉన్న కారణంగా... విచారణకు హాజరుకాలేనని మెయిల్ ద్వారా తెలిపారు కవిత. కవిత మెయిల్‌పై ఈడీ ఎలాంటి నిర్ణయం తెలపలేదు.

Jyothi

Jyothi

Next Story