ED Notice: లాలూ ప్రసాద్‌, తేజస్వి యాదవ్‌కు ఈడీ నోటీసులు

ED Notice: 22న తెజస్వీ, 27న లాలూ రావాలని నోటీసులు

Jyothi
Updated on: 21 Dec 2023 10:53 AM IST
ED Issue Notices To Lalu Prasad Yadav And Tejaswi Yadav
X

ED Notice: లాలూ ప్రసాద్‌, తేజస్వి యాదవ్‌కు ఈడీ నోటీసులు

ED Notice: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం సమన్లు జారీ చేసింది. నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం కింద నమోదైన కేసులో ఇద్దరి వాదనలు రికార్డు చేసేందుకు తేజస్వీ ఈనెల 22న, లాలూ ప్రసాద్ యాదవ్ 27న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీలతో సన్నిహిత సంబంధాలున్న వ్యాపారవేత్త అమిత్ కత్యాల్‌ను గత నెలలో ఈడీ అరెస్టు చేసింది. ఈఏడాది ఏప్రిల్‌లో ఈడీ తేజస్వీ యాదవ్‌ను ఈడీ విచారించింది.

Jyothi

Jyothi

Next Story