MLC Kavitha: లిక్కర్ స్కాం కేసులో 3 గంటలుగా కవితను ప్రశ్నిస్తున్న ఈడీ

Delhi Liqour Scam: పిళ్లైతో కలిపి కవితను విచారిస్తున్న ఈడీ అధికారులు

Dhatripriya
Published on: 11 March 2023 2:36 PM IST
ED Is Questioning Kavitha For 3 Hours In Delhi Liqour Scam
X

MLC Kavitha: లిక్కర్ స్కాం కేసులో 3 గంటలుగా కవితను ప్రశ్నిస్తున్న ఈడీ

Delhi Liqour Scam: ఈడీ ఆఫీస్‌లో కవిత విచారణ కొనసాగుతోంది. లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో మూడు గంటలుగా కవితను ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు. సౌత్‌ గ్రూప్‌ నెట్‌వర్క్‌పైనే ప్రధానంగా ఈడీ విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు కవిత విచారణపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ తెలుసుకుంటున్నారు. ఢిల్లీ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులతో ప్రగతి భవన్‌లో సీఎం సమావేశమైనట్లు తెలుస్తోంది. ఇక కవిత దర్యాప్తు కొనసాగుతుండటంతో బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ బాట పట్టారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు, మంత్రులు ఢిల్లీ చేరుకోగా.. మంత్రి వేముల కూడా ఢిల్లీ బయలుదేరారు.

Dhatripriya

Dhatripriya

Next Story