క్యాసినో వ్యవహారంలో కొనసాగుతున్న ఈడీ విచారణ

Casino Case: చికోటి ప్రవీణ్, సంపత్‌ ఆర్థిక లావాదేవీలను పరిశీలించిన ఈడీ

Jyothi
Updated on: 31 July 2022 2:00 PM IST
ED Investigation Continue on Chikoti Praveen Kumar Over Casino Issue
X

క్యాసినో వ్యవహారంలో కొనసాగుతున్న ఈడీ విచారణ

Casino Case: క్యాసినో వ్యవహారంలో ఈడీ విచారణ కొనసాగుతోంది. చికోటి ప్రవీణ్, సంపత్‌ ఆర్థిక లావాదేవీలను ఈడీ పరిశీలించింది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతలకు చికోటి బినామీగా ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. కోట్ల రూపాయలు హవాలా ద్వారా లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. క్యాసినో క్యాంపు ముగిసిన తర్వాత వారు గెలుచుకున్న ప్రైజ్ మనీని హవాలా రూపంలో అందజేసినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. పంటర్ల నుంచి కమీషన్ల రూపంలో చికోటి ప్రవీణ్ కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్లు గుర్తించారు. ఇక నేపాల్, శ్రీలంక, థాయిలాండ్, ఇండోనేషియాలో ఏడు క్యాసినో క్యాంపులు ఏర్పాటు చేసినట్లు ఆధారాలు సేకరించారు. రేపు చికోటి ప్రవీణ్, మాధవరెడ్డి, సంపత్‌ను ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు.


Jyothi

Jyothi

Next Story