TSPSC: నిందితులు స్టేట్‌మెంట్‌లు రికార్డు చేసేందుకు.. అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో ఈడీ పిటిషన్‌ దాఖలు

* కోర్టు అనుమతితో ప్రవీణ్‌, రాజశేఖర్‌ను కస్టడీకి తీసుకోనున్న ఈడీ

Dhatripriya
Published on: 12 April 2023 11:36 AM IST
ED Filed Petition In Nampally Court About Record Statements
X

TSPSC: నిందితులు స్టేట్‌మెంట్‌లు రికార్డు చేసేందుకు.. అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో ఈడీ పిటిషన్‌ దాఖలు

TSPSC: టీఎస్‌పీఎస్సీ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌ స్టేట్‌మెంట్‌లు రికార్డు చేసేందుకు.. అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో ఈడీ పిటిషన్‌ దాఖలు చేసింది. విదేశాల నుంచి వచ్చి గ్రూప్‌-1 రాశారనే అభియోగాలపై ఈడీ విచారించనుంది. మనీలాండరింగ్‌ జరిగినట్టు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. సిట్‌ సాక్షిగా పేర్కొన్న శంకర్‌లక్ష్మిపై ఈడీ దృష్టి సారించింది. ఈనెల 13, 14న విచారణకు రావాలని శంకర్‌లక్ష్మి, బోర్డు సభ్యుడు సత్యనారాయణకు నోటీసులు అందించింది. కోర్టు అనుమతితో ప్రవీణ్‌, రాజశేఖర్‌ను కస్టడీకి తీసుకోనున్నారు ఈడీ అధికారులు.

Dhatripriya

Dhatripriya

Next Story