Nagarjuna Sagar: నాగార్జునసాగర్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది.

Arun Chilukuri
Published on: 23 March 2021 7:14 PM IST
ECI Issue Notification for Nagarjuna sagar Assembly By-poll
X

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈరోజు నుంచి ఈనెల 30వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈనెల 31న నామినేషన్లను పరిశీలించనుండగా ఏప్రిల్ 3వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశముంది. ఇక, ఏప్రిల్ 17న పోలింగ్ జరగనుండగా మే 2న ఓట్ల లెక్కింపు జరగనుంది.

నాగార్జునసాగర్ ఉపఎన్నికకు ఇంకా 25రోజులు మాత్రమే సమయం ఉండటంతో అభ్యర్ధుల ఖరారుపై ప్రధాన పార్టీలన్నీ దృష్టిపెట్టాయి. అలాగే, ప్రచార వ్యూహంపై పార్టీలు కసరత్తులు ప్రారంభించాయి. అయితే, ఇప్పటివరకు కాంగ్రెస్ మాత్రమే అభ్యర్ధిని ప్రకటించింది. దాంతో, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఈనెల 29న నామినేషన్ వేయనున్నారు. అయితే, అధికార పార్టీ టీఆర్ఎస్ తన అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే తమ అభ్యర్థిని ప్రకటించాలని బీజేపీ భావిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story