మునుగోడులో భారీగా నామినేషన్లు తిరస్కరణ.. కేఏ పాల్‌కు చుక్కెదురు..

Munugode By Election: మునుగోడు ఉపఎన్నికను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

Arun Chilukuri
Published on: 16 Oct 2022 12:18 PM IST
EC Rejected 47 Nominations In Munugode By Election
X

మునుగోడులో భారీగా నామినేషన్లు తిరస్కరణ.. కేఏ పాల్‌కు చుక్కెదురు..

Munugode By Election: మునుగోడు ఉపఎన్నికను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన నామినేషన్ల పర్వంలో పరిశీలన ప్రక్రియ బరిలో దిగాలనుకున్న అభ్యర్థులకు షాకిచ్చింది. ఉపఎన్నికలో పోటీచేయాలని ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్ర అభ్యర్థులు అందరూ కలిసి 130 మంది నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలనలో సరైన సమాచారంలేని 47 నామినేషన్లను తిరస్కరించారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఎ పాల్ పార్టీ తరఫున వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. కేఎ పాల్ స్వతంత్ర అభ్యర్థిగా దాఖలు చేసిన నామినేషన్‌‌ను మాత్రం ఎన్నికల అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story