Rythu Bandhu: రైతులకు గుడ్‌న్యూస్‌.. ‘రైతుబంధు’కు ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌

Rythu Bandhu: బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిపాదనను అంగీకరించిన ఈసీ

Shekhar G
Published on: 25 Nov 2023 11:08 AM IST
Ec Permission For Release Of Telangana Rythubandhu Funds
X

Rythu Bandhu: రైతులకు గుడ్‌న్యూస్‌.. ‘రైతుబంధు’కు ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌

Rythu Bandhu: ఎన్నికల ముందు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఊరట లభించింది. రైతుబంధు నగదు పంపిణీకి రూట్ క్లియర్ అయింది. రైతుబంధు నిధులను విడుదల చేసేందుకు ఈసీ అనుమతి కోరింది తెలంగాణ ప్రభుత్వం. సర్కార్ ప్రతిపాదనలను పరిశీలించిన ఎన్నికల సంఘం.. పర్మిషన్ ఇచ్చింది.

యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు పంట పెట్టుబడి ఆర్థిక సహాయాన్ని విడుదల చేయుటకు ఎన్నికల కమిషన్ ఆమోదించినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ తెలిపింది. ప్రతి ఏటా వానాకాలం సీజన్ మరియు యాసంగి సీజన్ ప్రారంభం అయిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి ఆర్థిక సహాయంగా రైతుబంధు నిధులను విడుదల చేస్తుంది. అదే విధంగా ఈ యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధును గతంలో వలే తక్కువ భూ విస్తీర్ణం ఉన్న రైతులకు మొదటగా ఇచ్చే పద్ధతిలో పంపిణీ చేసే ప్రక్రియను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ తెలిపింది.

Shekhar G

Shekhar G

Next Story