Badrachalam: భద్రాద్రి రామయ్య కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి

Badrachalam: భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణం ప్రసార మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల సంఘం అనుమతిచ్చింది.

Shashank Gullapelli
Published on: 16 April 2024 9:30 PM IST
EC Permission For Live Telecast Of Bhadradri Ramayya Kalyanam
X

Badrachalam: భద్రాద్రి రామయ్య కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి

Badrachalam: భద్రాచలం శ్రీసీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాములోరి కల్యాణం ప్రత్యక్ష ప్రసారం చేయకూడదని ఏప్రిల్‌ 4న ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. గత 40 ఏళ్లుగా లైవ్‌ టెలికాస్ట్‌ చేస్తున్నామని, ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ తెలంగాణ దేవాదాయశాఖ ఈసీకి లేఖ రాసింది. ఈసీ నిర్ణయంపై రాజకీయ పార్టీలు కూడా అభ్యంతరం తెలిపాయి. దీంతో స్పందించిన ఎన్నికల సంఘం .. రేపటి కల్యాణ మహోత్సవాన్ని లైవ్‌ ప్రసారం చేసేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story