తెలంగాణలో కౌంటింగ్‌కి ఏర్పాట్లు చేస్తున్న ఈసీ

EC: కౌంటింగ్ కోసం 49 కేంద్రాలు ఏర్పాటు

Jyothi
Published on: 1 Dec 2023 10:47 AM IST
EC Making Arrangements for Counting in Telangana
X

తెలంగాణలో కౌంటింగ్‌కి ఏర్పాట్లు చేస్తున్న ఈసీ 

EC: తెలంగాణలో పోలింగ్ ఘట్టం ముగిసింది. ఇక మిగిలింది కౌంటింగ్.. దీనిపై ఈసీ కసరత్తు చేస్తోంది. 119 నియోజకవర్గాల కౌంటింగ్ కోసం 49 కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్ ప్రారంభం కానున్నట్టు ఈసీ ప్రకటించింది. హైదరాబాద్ పరిధిలో 15 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది ఈసీ..

ఇక ఈవీఎంలను భద్రపరిచిన.. స్ట్రాంగ్ రూంల దగ్గర మూడెంచల భద్రత ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో.. తెలంగాణ పోలీసులుతో పాటు.. పారా.. సాయుధ బలగాలు పహారా ఉండనుంది. స్ట్రాంగ్ రూంకి డబుల్ లాక్ సిస్టం ఏర్పాటు చేసినట్టు ఈసీ పేర్కొంది. ఒక వేళ పొలిటికల్ లీడర్లకు ఏదైనా అనుమానం ఉంటే.. స్ట్రాంగ్ రూం దగ్గరే ఉండొచ్చని.. ఈసీ తెలిపింది.

Jyothi

Jyothi

Next Story