Warangal: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కౌంటింగ్‌కు ఈసీ ఏర్పాట్లు

Warangal: వరంగల్ ఈస్ట్, వెస్ట్, పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట కౌంటింగ్ వరంగల్‌లోనే

Jyothi
Published on: 2 Dec 2023 11:19 AM IST
EC Arrangements for Counting in Warangal District
X

Warangal: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కౌంటింగ్‌కు ఈసీ ఏర్పాట్లు

Warangal: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేస్తుంది ఈసీ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఐదు జిల్లాలో కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేస్తుంది. వరంగల్ తూర్పు, పశ్చిమ, పరకాల, వర్దన్నపేట, నర్సంపేట నియోజకవర్గాలకు చెందిన EVMలు ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో స్ట్రాంగ్ రూమ్స్ కు తరలించారు. దీనికి సంబంధించిన కౌంటింగ్ కేంద్రం కూడా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లోనే ఏర్పాటు చేసింది.

ఇక మహబూబాబాద్, డోర్నకల్‌కు, సంబంధించి... మహబూబాబాద్ జిల్లాలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘన్‌పూర్‌ నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రం జనగామలోని విద్యాభారతి ఇంజనీరింగ్ కాలజీలో ఏర్పాటు చేశారు. ఇక ఏజెన్సీ ప్రాంతమైన ములుగులో ఆ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే కౌంటింగ్ కు ఏర్పాట్లు చేసింది ఈసీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో... భూపాలపల్లి నియోజకవర్గ ఓట్ల లెక్కింపు స్థానిక అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించేందుకు ఈసీ ఏర్పాటు చేస్తోంది. అన్ని స్ట్రాంగ్ రూంల దగ్గర మూడంచెల భద్రతను ఏర్పాటు చేసింది. డబుల్ లాక్ సిస్టమ్‌తో పాటు.. నిరంతరం సీసీ కెమెరా నిఘాలో స్ట్రాంగ్‌ రూంల నిఘా ఉండనుంది.

Jyothi

Jyothi

Next Story