2022 Voter List: తెలంగాణలో 2022 ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ ప్రకటించిన ఈసీ

2022 Voter List: ఆగస్టు 9 నుంచి 31 వరకు ఇంటింటి సర్వే, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ

Sandeep Eggoju
Published on: 5 Aug 2021 9:52 PM IST
EC Announced the 2022 Voter List Revision Schedule in Telangana
X

2022 ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ ప్రకటించిన ఈసీ (ఫైల్ ఇమేజ్)

2022 Voter List: తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణకు ఎన్నికల కమిషన్‌ సిద్ధమైంది. జాబితా సవరణకు షెడ్యూల్ ప్రకటించింది. ఆగస్టు 9 నుంచి 31 వరకు ఇంటింటి సర్వే, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ లాంటి ముందస్తు చర్యలు చేపట్టనున్నారు అధికారులు. 2021 నవంబర్ 1న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురించి.. నవంబర్ నెలాఖరు వరకు అభ్యంతరాలు, వినతులు స్వీకరిస్తారు. డిసెంబర్ 20 వరకు అభ్యంతరాలు, వినతులపై పరిష్కారాలు జరుగుతాయి. 2022 జనవరి 1 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ చేయనుండగా.. 2022 జనవరి 5న తుదిజాబితా వెలువడనుంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story