ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ప్రమాణస్వీకారం

Eatala Rajender: హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ప్రమాణస్వీకారం చేశారు.

Arun Chilukuri
Published on: 10 Nov 2021 2:49 PM IST
Eatala Rajender Takes Oath as MLA
X

ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ప్రమాణస్వీకారం

Eatala Rajender: హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీలోని స్పీకర్‌ చాంబర్‌లో రాజేందర్‌తో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రమాణాస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజేందర్ అకారణంగా తనను మంత్రి వర్గం నుంచి తొలగించినట్లు చెప్పారు. రాబోయే కాలంలో కేసీఆర్ కు ప్రజలు గుణపాఠం చెప్తారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే అసెంబ్లీలో హక్కులు ఉండేవని అ‍న్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలకు గౌరవం లేదని తెలిపారు. ఇవాళ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన తర్వాత.. మీడియా పాయింట్‌లో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story