Eatala Rajender: ఈటల సొంతూరులో అభిమానుల వినూత్న నిరసన

Eatala Rajender: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఈటల అభిమానులు వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశారు.

Arun Chilukuri
Published on: 6 May 2021 5:36 PM IST
Eatala Rajender Followers Protests on Lake
X

Eatala Rajender: ఈటల సొంతూరులో అభిమానుల వినూత్న నిరసన

Eatala Rajender: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఈటల అభిమానులు వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈటల సొంతూరు కమలాపూరులో ఆయన అభిమానులు, కార్యకర్తలు వినూత్నంగా నిరసనకు దిగారు. చెరువులో దిగి నిరసన తెలిపారు ఈటల రాజేందర్ అభిమానులు. ఈటలను మంత్రి పదవి నుంచి తప్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈటల రాజేందర్‌పై ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందని మండిపడ్డారు. ఈటలకు మాత్రమే కాదని.. బడుగు బలహీన వర్గాల ప్రజలకు కేసీఆర్ అన్యాయం చేశారని ఆరోపించారు. కేసీఆర్ గడిల పాలనకు చరమగీతం పాడే సమయం దగ్గర్లో ఉందని హెచ్చరించారు. కేసీఆర్‌ కేబినెట్‌లో ఎంతో మంది మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డారని అలాంటి వారిని కూడా పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story