Earthquake: తెలంగాణలో భూ ప్రకంపనల కలకలం

* మంచిర్యాల, నిర్మల్ జిల్లా బైంసాలో స్వల్పంగా కంపించిన భూమి * భయంతో బయటకు పరుగులు తీసిన జనాలు

Shilpa
Updated on: 1 Nov 2021 12:38 PM IST
Earthquakes for 3 seconds in Some Districts of Telangana
X

తెలంగాణలో భూ ప్రకంపనల కలకలం(ఫోటో- ది హన్స్ ఇండియా)

Earthquake: తెలంగాణలోని పలు జిల్లాల్లో భూ ప్రకంపనలు కలకలం రేపుతున్నాయి. మంచిర్యాల, కొమురం భీం, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భూమి కంపించింది. బైంసాలో భూ ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసారు.

జగిత్యాల జిల్లాలోని జగిత్యాల పట్టణంలో గల రహమత్ పురాలో భూ ప్రకంపనలు వచ్చాయి. ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూరు, సలుగుపల్లి గ్రామాల్లో భూమి కంపించింది. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా స్వల్పంగా మూడు సెకన్ల పాటు భూమి కంపించింది.

Shilpa

Shilpa

Next Story