logo
తెలంగాణ

Earth Quake: నాగర్‌కర్నూలు జిల్లాలో భూ ప్రకంపనలు

Earthquake in Nagarkurnool District
X

Image Source : The Hans India

Highlights

Earth Quake: అచ్చంపేట, అమ్రాబాద్‌, ఉప్పునుంతలలో కంపించిన భూమి * రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 4.0గా నమోదు

Earth Quake: నాగర్‌కర్నూలు జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించాయి. జిల్లాలోని అచ్చంపేట, లింగాల పరిసర గ్రామాలతో పాటు.. అమ్రాబాద్‌, ఉప్పునుంతల మండలాల్లో ఉదయం 5 గంటల సమయంలో కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. దీంతో.. భయాందోళనకు గురైన ప్రజలు.. ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఎన్‌సీఎస్‌ అధికారులు.. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 4.0గా నమోదైనట్టు తెలిపారు. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చాయని వెల్లడించారు. హైదరాబాద్‌కు దక్షిణంగా 150 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని తెలిపారు.


Web TitleEarthquake in Nagarkurnool District
Next Story