Dussehra Holidays 2022: దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకంటే..?

Dussehra Holidays 2022: తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు తీపి కబురు అందించింది.

Arun Chilukuri
Updated on: 13 Sept 2022 12:45 PM IST
Dussehra Holidays From September 26 TO October 9 in Telangana
X

Dussehra Holidays 2022: దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకంటే..?

Dussehra Holidays 2022: తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు తీపి కబురు అందించింది. మంగళవారం ఈ ఏడాది దసరా పండుగకు 13 రోజులపాటు సెలవులను అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాధికారులకు సర్క్యులర్‌ పంపించింది. వచ్చే నెల 5న దసరా పండుగ. అందుకు 10 రోజుల ముందుగానే పాఠశాలలకు సెలవులు ప్రారంభం కానున్నాయి. దసరా పండుగ నేపథ్యంలో సెప్టెంబర్‌ 26వ తేదీ నుంచి అక్టోబర్‌ 8వ తేదీ వరకు సెలవులు ఇస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే, ఈ నెల 25, అక్టోబరు 9వ తేదీ ఆదివారాలు కావడంతో మొత్తం 15 రోజుల పాటు సెలవులు కొనసాగనున్నాయి. పాఠశాలలు తిరిగి అక్టోబరు 10న ప్రారంభమవుతాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story