మొక్కులు చెల్లించుకున్న రఘునందన్‌రావు

Arun Chilukuri
Published on: 11 Nov 2020 12:48 PM IST
మొక్కులు చెల్లించుకున్న రఘునందన్‌రావు
X

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు తిరుపతి చేరుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు దక్షిణాదిన బీజేపీ విజయానికి నాంది అన్నారు. బుధవారం ఉదయం ఆయన తిరుమల విచ్చేసి, స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. అనంతరం వెంకన్న దర్శనం చేసుకున్నారు. శ్రీవారికి మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చానన్న ఆయన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ కార్యకర్తలు ప్రజల సమస్యల పరిష్కారంలో మరింత చురుగ్గా పని చేయాలని కోరారు. దుబ్బాక లాగే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ జెండా రెపరెపలాడుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story