దుబ్బాక ఉపఎన్నిక కౌంటింగ్‌: ఆరో రౌండ్‌లో టీఆర్ఎస్‌ ఆధిక్యం

Arun Chilukuri
Published on: 10 Nov 2020 11:41 AM IST
దుబ్బాక ఉపఎన్నిక కౌంటింగ్‌: ఆరో రౌండ్‌లో టీఆర్ఎస్‌ ఆధిక్యం
X

దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను బట్టి తొలి ఐదు రౌండ్లలో బీజేపీ ఆధిక్యం ప్రదర్శించింది. ఆరో రౌండ్‌లో టీఆర్ఎస్‌కు ఆధిక్యంలోకి వచ్చింది. ఆరో రౌండ్‌లో టీఆర్ఎస్‌ 4,062 ఓట్లు సాధించగా, బీజేపీ అభ్యర్థికి 3,709 ఓట్లు వచ్చాయి. ఆరు రౌండ్లలో టీఆర్ఎస్‌ అభ్యర్థి గెలుపొందిన తొలి రౌండ్‌ ఇది. 353 ఓట్లతో లీడ్‌ లోకి వచ్చింది. ఆరో రౌండ్ ముగిసే సమయానికి బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది. 2667 బీజేపీ ముందంజలో కొనసాగుతుంది.

మొత్తం 23 రౌండ్లు, ఇంకా 17 రౌండ్ల లెక్కింపు జరగాల్సి ఉండగా.. విజయం ఎవరినైనా వరించే అవకాశముంది. ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు టీఆర్‌ఎస్ నుంచి సోలిపేట సుజాత‌, కాంగ్రెస్ పార్టీ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి‌, బీజేపీ నుంచి రఘునందర్‌రావుతో పాటు చిన్నాచితక పార్టీల నుంచి 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story